వైద్యారోగ్య శాఖ నుండి తప్పుకుంటూ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసిన జవహర్ రెడ్డి

-

టీటీడీ ఈఓ గా నియమితులైన నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నుండి తప్పుకుంటూ ప్రభుత్వం తరపున జవహర్ రెడ్డి వివాదాస్పద ఉత్తర్వు జారీ చేశారు. ఎస్వీ వైద్య కళాశాల పీడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్ గా డా.కిరీటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డా.శశి కుమార్ ను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తిరిగి నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో A2, A3గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వైద్యులకి మళ్ళీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. 2018 ఆగస్టులో డాక్టర్ శిల్ప బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైద్యకళాశాల ప్రొఫెసర్ల వేధింపులే కారణమంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ఈ వ్యహారంపై సీఐడీ విచారణ కూడా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో కళాశాలలో శాఖాపరమైన విచారణ కూడా జరిగింది. మరి ఏమయిందో ఏమో వారి మీద క్లీన్ చిట్ లాంటివి ఏవీ రాకుండానే ఆ వైద్యులకు తిరిగి పోస్టింగ్ ఇస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version