వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకున్న మిస్టర్ 360….

-

మిస్టర్ 360 గా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ టి20 క్రికెట్ అంటే ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో క్రికెట్ అభిమానులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా సూర్య ఒక రికార్డును నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌ ఫార్మాట్‌లో ‘ఐసీసీ మెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ఆఫ్‌ ది ఈయర్‌’ అవార్డును సూర్య కుమార్ సొంతం చేసుకున్నాడు. గత ఏడాది ఈ అవార్డును సొంతం చేసుకున్న సూర్య….. వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించారు.

 

 

2023లో  ఈ విధ్వంసక బ్యాటర్‌.. 17 ఇన్నింగ్స్‌లలోనే స్ట్రైక్‌ రేట్‌ 155.95 మెయింటెన్ చేస్తూ 48.86 సగటుతో 733 రన్స్ చేశాడు. 17 ఇన్నింగ్స్‌లలో సూర్య రెండు సెంచరీలను కూడా బాదాడు.అవార్డు కోసం సూర్య న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌,అల్పేశ్ రమ్‌జాని (ఉగాండా),జింబాబ్వే ఆల్‌ రౌండర్‌ సికందర్‌ రజా లతో పోటీ పడ్డాడు. కానీ ఈ ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ని వరించింది. కాగా స్వదేశంలో ఆసిస్ సిరీస్‌తో పాటు సౌత్ ఆఫ్రికా పర్యటనలోనూ ఇండియాను నడిపించిన సూర్య.. దక్షిణాఫ్రికా టూర్‌లో గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news