వారికి రెండు నాల్కల ధోరణి పోదా?

-

కరోనా వల్ల లాక్ డౌన్ అవ్వడంతో జానాలు అంతా ఒకరకమైన ఫ్రస్ట్రేషన్ లో ఉంటే… ఏపీ టీడీపీ నేతలు మరోరకం ఫ్రస్ట్రేషన్ లో పడిపోయినట్లు అనిపిస్తుంది తాజా పరిస్థితులను గమనిస్తుంటే! ఏపీ అధికారపార్టీ నేతలు చేస్తున్న పనులపై విమర్శలు గుప్పించడంలో ఎవరికి తోచిన పంథా వారు ఎంచుకుంటూ… “మాకు క్లారిటీ లేదు… మాది ఒక్క నాలుక కాదు” అనే సంకేతాలు ఇస్తున్నారు!

వివరాళ్లోకి వెళ్తే… కరోనా తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోవడంతో లాక్ డౌన్ ముందుగా అనుకున్న 21రోజులు కాకుండా మరో 19 రోజులకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ సమయంలో సామాన్యుడి ఇబ్బందులు చెప్పలేనన్ని ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం చేసే సాయం ప్రభుత్వం ఒక పక్క చేస్తూనే ఉన్నా.. మరోపక్క అధికారపార్టీ నేతలు, సమాజంలో కాస్త స్థోమతుండి మనసున్నవారు, స్వచ్చంద సంస్థలు… వారి వారికి తోచిన సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో… “తాను ఏడ్వలేడు.. ఏడ్చేవాడిని చూస్తే ఆగలేడు” అన్నచందంగా తయారయ్యింది టీడీపీ నేతల తీరు.

కనీసం.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పుట్టిన రోజు సందర్భంగా కూడా పదిమందికి నిత్యావసరవస్తువులు అందించే ఆలోచన చేయలేదు అనే విమర్శలు మూటగట్టుకున్న టీడీపీ నేతలు… ఆ ఆలోచన చేసి ఆచరణలో పెడుతున్న వైకాపా నేతలపై రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారు. వైకాపా నేతల్లో కొందరు వీది వీదికీ వెళ్లి నిత్యావసరవస్తువులు పంచుతుంటే… “వైకాపా నేతలే కరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్నారు” అంటూ గోళ పెడుతున్నారు టీడీపీ నేతలు! సరేలే ఇలా ఎందుకు తిరగడం అని భావించి ఒకే చోట నిలబడి అందిస్తుంటే… “జనాలను ఒక్కచోట చేర్చి.. పబ్లిసిటీ చేసుకుంటున్నారు” అని మరోరకం గోలపెడుతున్నారు!

దీంతో… మంచా, చెడా అనే ఆలోచన చేసి మాట్లాడే శక్తిలేని వారి విమర్శలకు స్పందించడం అనవసరం అని ఒకరకమైన కామెంట్లు వినిపిస్తుంటే… నాడు రెండు కళ్ల సిద్దాంతం తో జీవితకాలానికి సరిపడా అన్యాయం చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు రెండు నాల్కల ధోరణితో మాట్లాడి, ఇబ్బందుల్లో ఉన్నవారు ఆకలిచావులు చస్తే.. వారి చావులపై రాజకీయం చేయాలని భావిస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా… ఇంత అనుభవం ఉన్న నాయకులు ఉన్న అంత పెద్ద పార్టీ తరుపున విమర్శలు చేసేముందు… ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడంతోపాటు, కనీసం వారంతా ఒకేమాటపై ఉండాలని పలువురు సూచిస్తున్నారు!! ఈ విషయంలో ముందుగా అధినేతమారితే.. తర్వాత మిగిలిన నాయకులు మారతారనే కామెంట్లు సైతం వినిపించడం కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Exit mobile version