తెదేపా ఎంపీ సీఎం రమేష్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జూమున కేంద్ర నుంచి 60 మంది అధికారులు కడప, హైదరాబాద్ లోని రమేష్ ఇళ్లు, కార్యాలయాలతో పాటు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 15 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. పీఏసీ మెంబర్ గా ఉన్న సీఎం రమేష్… ఏపీలో ఎవరిపైన, ఎక్కడెక్కడ దాడులు చేస్తారో వివరాలు వెళ్లడించాలని మూడు రోజుల క్రితం ఐటీ శాఖకు లేఖ రాసిన మూడో రోజే ఆయనపై ఐటీ దాడులు చేయడం చర్చనీయాంశమైంది.
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేస్తున్న పోరాటానికిగాను కేంద్ర తనపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని సీఎం రమేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముళ్లుని ముళ్లుతోనే తీస్తాం అంటూ ఘాటుగా స్పందించారు.