యూనివర్సిటీలు, కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవద్దు..!

-

ఇది నిజంగా విద్యార్థులకు వరమే. యూనివర్సిటీలు, కాలేజీలు.. మిగితా విద్యాసంస్థలు ఇలా ఏవైనా.. విద్యార్థులకు ఏ కోర్సులో ప్రవేశం కల్పించినా.. వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను మాత్రం ఇక నుంచి తీసుకోకూడదు. ఇదివరకు ఏ కోర్సులో చేరినా.. విద్యార్థులు వారి ఒరిజినల్స్ అన్నీ ఆయా విద్యా సంస్థకు సమర్పించాల్సి ఉండేది. కానీ.. ఇప్పటి నుంచి విద్యార్థులు ఒరిజినల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈసందర్భంగా యూజీసీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు.

అంతే కాదు.. విద్యార్థి అడ్మిషన్ ను రద్దు చేసుకున్నా.. నిబంధనల ప్రకారం ఫీజును కూడా వాపస్ చేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. విద్యా సంస్థలన్నీ ఈ నిబంధనలను పాటించకపోతే.. యూజీసీ ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటుందని మంత్రి హెచ్చరించారు. సెల్ఫ్ డిక్లరేషన్ తో పాటు ఆ విద్యార్థికి సంబంధించిన జిరాక్స్ కాపీలను మాత్రమే విద్యా సంస్థలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. అడ్మిషన్ లాస్ట్ డేట్ కన్నా 15 రోజుల ముందుగానే ఆ విద్యార్థి తన అడ్మిషన్ ను క్యాన్సల్ చేసుకుంటే అతడి లేదా ఆమె ఫీజు మొత్తం వాపస్ ఇవ్వాలని మంత్రి తెలిపారు. ఈ నిబంధనలను అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, విద్యా సంస్థలు పాటించాల్సిందేనని.. ఒకవేళ ఆ విద్యా సంస్థలు నిబంధనలను గాలికి వదిలేస్తే వాటి అఫిలియేషన్, డీమ్డ్ హోదా, యూజీసీ సాయం.. అన్నీ నిలిపేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version