హ్యారీ బ్రూక్‌ స్థానములో మరో క్రికెటర్ పేరు ప్రకటించిన ఇంగ్లండ్‌…..

-

ఈనెల 25న భారత్ ఇంగ్లాండ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగే మొదటి టెస్టుకు ముందే ఇంగ్లాండుకు పెద్ద షాక్ తగిలింది. ఇండియా – ఇంగ్లండ్‌ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ కి వ్యక్తిగత కారణాలతో హ్యారీ బ్రూక్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.తాజాగా ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు అతని స్థానంలో సర్రే బ్యాటర్‌ డాన్‌ లారెన్స్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది. 26 ఏళ్ళ లారెన్స్‌.. ఇప్పటివరకూ 11 టెస్టు మ్యాచ్ లు ఆడి 21 ఇన్నింగ్స్‌లలో 551 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి.

మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన లారెన్స్‌కు బౌలింగ్‌లోనూ సత్తా చాట గలడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 2 సంవత్సరాల క్రితం అరంగేట్రం చేసిన లారెన్స్‌.. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌తో పాటు టీ20లలో రాణిస్తున్నాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 118 మ్యాచ్‌లు ఆడి 6,360 రన్స్ చేశాడు. ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో అతడి ఖాతాలో 15 సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20లలో 112 మ్యాచ్‌లు ఆడి 2,514 రన్స్ చేయడమే గాక 41 వికెట్లు కూడా తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version