నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా ? : కేటీఆర్

-

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించింది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రం లో హాంగ్ అసెంబ్లీ ఉండేది అని.. తక్కువ ఓట్ల తేడా తో 14 సీట్లు కోల్పోయాం. పోయిన సారి మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయాం. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

కార్యకర్తలు కష్టపడి పని చేస్తే మల్కాజ్ గిరి లో ఈ సారి విజయం మనదే అన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్ గత నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి పిలుపు నిచ్చారు. వారి మాటలనే నేను గుర్తు చేశాను. నేను బిల్లులు కట్టొద్దంటే భట్టి నాది విద్వంసకర మనస్తత్వం అని అంటున్నారు. నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా ? అని ప్రశ్నించారు. సోనియా గాంధీనే బిల్లులు కడుతుందని వాళ్ళు చెప్పారు ..కరెంటు బిల్లులు సోనియా కే పంపుదాం అన్నారు. సోనియా కు ప్రజలు బిల్లులు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలన్నారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ..మనం ఇప్పట్నుంచే ఒత్తిడి చేయాలి.నిరుద్యోగ భృతి పై భట్టి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పారు. నిరుద్యోగ భృతి పై కాంగ్రెస్ తప్పించుకున్నట్టే పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా పై మాట మార్చింది అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version