కోటి మంది జనాభా ఉన్న దేశం, ఉన్నదీ నాలుగు వెంటిలేటర్లు…!

-

కరోనా వైరస్ కట్టడి కావాలి అంటే వైద్య సదుపాయాలు అని చాలా అవసరం. వైద్య సదుపాయాలు ఎంత మెరుగ్గా ఉంటే కరోనా వైరస్ ని అంత కట్టడి చేయడం సాధ్యమవుతుంది. రోగుల ఆరోగ్యం ఎప్పుడు విషమించే అవకాశం ఉంది అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యాప్తి ఆగడం లేదు వైద్య సదుపాయాలు మెరుగు పడాల్సిన అవసరం ఉంది. అయితే ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

అసలు కీలకమైన వెంటిలేటర్ అనేది లేకుండా పోయింది. కొన్ని దేశాల్లో కోటి మంది జనాభా ఉన్నా కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. సౌత్ సూడాన్ అనే దేశంలో ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇంటర్నేషనల్‌ రెస్క్యూ కమిటీ(ఐఆర్‌సీ) అందించిన ఈ సమాచారం ప్రకారం… సుమారు 1.2 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. 24 ఐసీయూ పడకలే ఉన్నాయని తెలుస్తుంది.

అక్కడ కేసులు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయి. పెరిగితే చేసేది ఏమీ ఉండదు. బర్కినా ఫాసో దేశంలో 11 ఉండగా, సియర్రా లియోన్‌లో 13 ఉన్నాయి. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లో 3 వెంటిలెటర్లు మాత్రమే ఉన్నాయి. దాదాపు 3 కోట్ల జనాభా కలిగిన వెనెజువెలా దేశంలో 84 ఐసీయూ పడకలు ఉన్నాయి. ఈ దేశాల్లోని 90 శాతం ఆసుపత్రుల్లో మందుల కొరత, అత్యవసర పరికరాల కొరత దారుణంగా ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version