రాష్ట్రంలో కులగణన పై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ కి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల్లో మేధావులు, ఇతర సంఘాల నాయకుల కోరిక మేరకు రాష్ట్రంలో మరోసారి రీ సర్వేకు ప్రభుత్వం అనుమతించిందని అన్నారు. కానీ సర్వేకు చాలా తక్కు స్పందన వచ్చిందని అన్నారు. ఈ పరిణామం తమను తక్కువ చేసి చూపారని అనే వాళ్లకు ఓ సమాధానమని కామెంట్ చేశారు. సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం మరోసారి అవకాశం ఇచ్చిన సద్వినియోగం చేసుకోకపోవడం బాధకరమని అన్నారు.
అదేవిధంగా కులగణనపై మాట్లాడే హక్కు బీజేపీ లేదని.. పార్టీ బీసీ జనగణనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు లో అఫిడవిట్ ఇచ్చిందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే తప్పులు ఉన్నాయంటూ కామెంట్ చేసిన కేసీఆర్. కేటీఆర్, హరీశ్ రావు లు మరోసారి సర్వేలో వివరాలు ఇవ్వలేదని.. ఇదేం
పద్ధతి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.