ఉత్తరాఖండ్ లో విషాదం..లోయలో వ్యాన్‌ పడి 10 మంది దుర్మరణం

-

ఉత్తరాఖండ్ లో విషాదం చోటు చేసుకుంది. తాజాగా ఉత్తరాఖండ్ చంపావతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం బోల్తా పడిన ఘటనలో ఏకంగా పది మంది మృతి చెందారు. సుఖిదాంగ్ – దం ద మినార్ రహదారి పై ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పంచముఖి ధర్మశాల కు చెందిన లక్ష్మణ్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్ పెళ్లికి వీరంతా వెళ్లారు.

సోమవారం అర్ధరాత్రి తర్వాత వీరంతా మహేంద్ర మ్యాక్స్ అనే వాహనంలో తిరిగి తమ స్వస్థలాలకు బయలుదేరారు. అర్ధరాత్రి తర్వాత అంటే నాలుగు గంటల సమయంలో వాహనం అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా వాహనం పక్కన ఉన్నాడు ఎలా పడిపోయింది.

ఈ ప్రమాద ఘటనలో ఏకంగా 10 మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు మహిళలు ముగ్గురు పురుషులు అలాగే ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని…. దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా లక్ష్మణ్సింగ్ బంధువులను పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version