ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేను షాక్‌కు గురయ్యా.. మైండ్ బ్లాంక్ అయిందంటూ బాంబ్ పేల్చారు జగ్గారెడ్డి. మీడియాతో చిట్ చాట్‌లో జగ్గారెడ్డి మాట్లాడారు. ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్‌లో ఉన్నానని తెలిపారు. నేనెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుందని మీడియాతో చిట్ చాట్‌లో వెల్లడించారు జగ్గారెడ్డి. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగానన్నారు. నేను ఢిల్లీ వెళ్లే సమయానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరని వెల్లడించారు.
ఇక అటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో సినిమాల్లోకి జగ్గారెడ్డి రాబోతున్నాడట. లవ్ స్టోరీలో స్పెషల్ రోల్ లో నటించనున్నారు జగ్గారెడ్డి. ఈ మేరకు చిట్ చాట్ లో వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి. నా ఒరిజనల్ క్యారెక్టర్ కు సినిమాలోని రోల్ అద్దం పట్టనుందని… అందుకే సినిమాలో నటిస్తానని ప్రకటించారు. పీసీసీ, సిఎం రేవంత్ రెడ్డిల అనుమతి తోనే సినిమాలో నటిస్తానని వెల్లడించారు.