ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతూ వస్తోంది. అయితే వాటి వలన ఎన్నో ఉపయోగాలను అందరూ పొందుతున్నారు. దీంతో దేశ అభివృద్ధి కూడా జరుగుతోంది. వాటిలో భాగంగా ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకం కూడా ఒకటి. ఈ పథకాన్ని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం రూపొందించడం జరిగింది. కాకపోతే ఈ పథకాల్లో చేరిన కార్మికులు 60 ఏళ్ల వరకు కొంత డబ్బుని చెల్లించాలి. ఇలా చేసిన తర్వాత ప్రభుత్వం కూడా కొంత ధనాన్ని జమ చేస్తుంది. దీంతో 60 ఏళ్లు వచ్చేసరికి కార్మికులకు మొత్తం ధనాన్ని చెల్లిస్తారు. ఎలా అయితే ఆర్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేసే వాళ్లు ఈపీఎఫ్ స్కీం ద్వారా ప్రయోజనాలను పొందుతారో. అదేవిధంగా ఈ పథకం ద్వారా అనార్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేసేవారు ఉపయోగాలను పొందవచ్చు.
అర్హత వివరాలు:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు 18 నుండి 40 ఏళ్ల వయసు మధ్యలో ఉండాలి మరియు వారి జీతం 15000 కంటే తక్కువగా ఉండాలి. కార్మికులు మాత్రమే కాకుండా దుకాణాలలో పనిచేసే వాళ్లు, ఇళ్లల్లో పని చేసేవారు, మధ్యాహ్న భోజనం పథకంలో పని చేసేవారు ఇలా అన్ని అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్లు అర్హులు.
దరఖాస్తు చేసే విధానం:
అర్హత కలిగిన కార్మికులు అధికారిక వెబ్సైట్ లో తగిన వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకానికి ఆధార్ కార్డ్, జన్ ధన్ ఖాతా, పొదుపు బ్యాంక్ ఖాతా తప్పక ఉండాలి. ఈ విధంగా ఆన్లైన్ లో ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు లేక కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఇదే ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీంతో అర్హులు అయిన వారు ధనాన్ని బ్యాంకు ఖాతా నుండి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెన్షన్ పథకం 60 ఏళ్ల వరకు కొనసాగుతుంది.