BREAKING: లగచర్ల దాడి ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లగచర్ల దాడి ఘటనలో మరో 10 మంది అరెస్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారట పోలీసులు.

లగచర్ల దాడి ఘటనలో మరో 10 మంది అరెస్ట్ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అలాగే.. రహస్యంగా విచారణ చేస్తున్నారట పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడి మరికొంత మంది కోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు పోలీసులు. అదుపులో ఉన్న వారిని సాయంత్రం లోపు రిమాండ్ చేసే అవకాశం ఉందని సమాచారం.