లాక్‌డౌన్ : కారు తీయ‌డం లేదా..? ఈ 10 టిప్స్‌తో కారును కండిష‌న్‌లో ఉంచుకోండి..!

-

దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌తో జ‌నాలు రోడ్ల‌పైకి అస్స‌లు రావ‌డం లేదు. త‌మ వాహ‌నాల‌ను చాలా మంది ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు తీయ‌డం లేదు. దీంతో వాహ‌నాలు ఇప్ప‌టికే రోజుల త‌ర‌బ‌డి అలాగే ఉంటున్నాయి. అయితే వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు తీయ‌క‌పోతే.. వాటిని జాగ్ర‌త్త‌గా ఉంచుకోవాల‌ని వాహ‌న‌తయారీ కంపెనీలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కార్ల‌ను ఎక్కువ రోజుల పాటు బ‌య‌ట‌కు తీయ‌రు క‌నుక‌.. వాటిని లాక్‌డౌన్ స‌మ‌యంలో సుర‌క్షితంగా.. మంచి కండిష‌న్‌లో ఉంచుకోవాల‌ని వాహ‌న త‌యారీ కంపెనీలు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నాయి. అవేమిటంటే…

* కారు ఎక్కువ రోజు పాటు క‌ద‌ల‌కుండా అలాగే ఉంటుంది క‌నుక వాటి హ్యాండ్ బ్రేక్‌ను తీసేసి.. కారు టైర్ల కింద స్టాప‌ర్ల‌ను ఉంచాలి. దీంతో హ్యాండ్ బ్రేక్‌పై భారం ప‌డకుండా ఉంటుంది.

* కారు టైర్ల‌లో ఉండే ప్రెష‌ర్‌ను త‌ర‌చూ చెక్ చేయాలి. అందుకు గాను కారును స్టార్ట్ చేసి ముందుకు, వెనుక‌కు న‌డిపించాలి. దీంతో టైర్లు డ్యామేజ్ కాకుండా ఉంటాయి.

* కార్ బ్యాట‌రీ మంచి కండిష‌న్‌లో ఉండాలంటే.. వాహ‌నాన్ని నెల‌కు ఒక్క‌సారైనా స‌రే.. క‌నీసం 15 నిమిషాల పాటు స్టార్ట్ చేసి.. ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచాలి.

* ఎస్‌యూవీల‌ను అయితే 30 నిమిషాల పాటు ఇంజిన్‌ను ఆన్ చేసి ఉంచాలి. అలాగే ఆ స‌మ‌యంలో కారు హెడ్‌లైట్ల‌ను కూడా ఆన్‌లో ఉంచాలి.

* కారును బ‌య‌ట‌కు తీసే ప‌ని ప్ర‌స్తుతం లేదు క‌నుక‌.. వాటిపై దుమ్ము, ధూళి ప‌డ‌కుండా, వ‌ర్షానికి త‌డ‌వ‌కుండా ఉండేందుకు గాను కార్ల‌పై క‌వ‌ర్ల‌ను కప్పాలి.

* కొంద‌రు కార్ల‌ను ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారు. అయితే లాక్‌డౌన్ ఉంది క‌నుక‌.. కార్ల‌ను బ‌య‌ట‌కు తీయాల్సి న ప‌నిలేదు క‌నుక‌.. ట్యాంక్ ఫుల్ చేయించాల్సిన అవ‌స‌రం లేదు. కొన్ని కిలోమీట‌ర్లు వెళ్లేంత ఫ్యుయ‌ల్ కారులో ఉంటే స‌రిపోతుంది. అత్య‌వ‌స‌రం అయితే బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఎలాగూ పెట్రోల్ పంప్‌లు ఉంటాయి క‌నుక.. ఫ్యుయ‌ల్ ఫిల్ చేసుకోవ‌చ్చు. కానీ కారు బ‌య‌ట‌కు తీయాల్సిన ప‌నిలేదు కనుక‌.. ట్యాంక్ ఫుల్ చేయించ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌. చేయిస్తే.. ఒక‌వేళ కారు బ‌య‌ట ఉంటే.. ఎండ‌కు ఫ్యుయ‌ల్ ఆవిరైపోయేందుకు అవ‌కాశం ఉంటుంది.. క‌నుక కారు ట్యాంక్ ఫుల్ చేయించేముందు ఒక్క‌సారి ఆలోచించండి.

* లాక్‌డౌన్ నేప‌థ్యంలో కారు ఎక్కువ రోజుల పాటు ఆగి ఉంటుంది క‌నుక‌.. కారులో ఆయిల్‌, వైప‌ర్ల‌లో నీరు.. త‌దిత‌ర లిక్విడ్‌ల‌ను చెక్ చేసుకోవాలి.

* కారును రెగ్యుల‌ర్‌గా ఆన్ చేస్తూ ఉండ‌డం వ‌ల్ల‌.. ఇంజిన్ కండిష‌న్‌లో ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు కారును స్టార్ట్ చేయ‌క‌పోతే.. కారు ఇగ్నిష‌న్‌లో స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

* కారును ఎక్కువ రోజు పాటు తీయ‌కుండా ఉంటే.. అందులో దుర్వాస‌న వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక అందులో పెర్‌ఫ్యూంను ఏర్పాటు చేసుకోవాలి.

* కారును కేవ‌లం బ‌య‌ట మాత్ర‌మే కాకుండా.. లోప‌ల కూడా శుభ్రం చేసుకోవాలి. దీంతో లోప‌ల కూడా దుమ్ము, ధూళి పేరుకోకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version