తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీలో మరో వెయ్యి విద్యుత్ బస్సులు చేరనున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుదల నేపథ్యంలో విద్యుత్ బస్సులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో అన్ని ప్రజా రవాణా సంస్థలకు అవసరమైన బస్సులను గుర్తించాలని కేంద్రం నిర్ణయించింది.
వచ్చే ఒకటి, రెండు సంవత్సరాల డిమాండ్ ఆధారంగా విద్యుత్ బస్సుల అవసరాన్ని అంచనా వేసేందుకు నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్ట్ పథకం కింద ఇటీవల కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది. ఆ మేరకు మరో వెయ్యి విద్యుత్ బస్సులు అవసరమని తెలంగాణ ఆర్టీసీ కేంద్రానికి పంపింది. తొలి విడతలో 40 బస్సులను కేటాయించింది. రెండో దఫా కూడా కొంత సబ్సిడీ తగ్గించే ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చిన అప్పట్లో ఆర్టీసీలో సుదీర్ఘకాలం పాటు ఉద్యోగుల సమ్మె కొనసాగుతూ ఉండటంతో పాటు అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడంతో ఆ అవకాశం చేజారింది.