ఈరోజుల్లో మనిషికి ప్రశాంతంగా తినడానికి కూడా టైం ఉండటం లేదు. ఇంకా తాపీగా వండుకునే టైం ఎక్కడు ఉంటుంది చెప్పండి. అందుకే చాలామంది ఈజీ కుక్కింగ్ ప్రాసెస్ కు అలవాటు పడిపోతున్నారు.అలా వచ్చినవే ఈ ప్రజర్ కుక్కర్స్. అసలు కుక్కర్స్ లో వండిన అన్నం తినొద్దు మొర్రో అని చెప్పినా..ఏం చేస్తాం..గ్యాస్ మీద వండేంత టైం లోదు..అదైతే పెట్టేసి వేరే పని చూసుకొవచ్చు అంటున్నారు. అలానే టీ తాగడానికి కూడా చాలామంది పౌడర్స్ కంటే..బ్యాగ్ లనే ప్రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్ టీ. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే..కానీ బ్యాగ్స్ లో ఉండేది తాగటం అసలు మంచిది కాదట. అనారోగ్యాన్ని కోరితెచ్చుకున్న వాళ్లవుతారంటున్నారు నిపుణులు.
సదరు కాఫీ లేదా టీ బ్యాగ్స్ మన శరీరానికి హాని కలిగిస్తాయని ఇటీవలే జరిగిన పరిశోధనల్లో తేటలెల్లమైంది. పలువురు సైంటిస్టులు చేసిన ప్రయోగాల్లో ఒక టీ బ్యాగ్ 11 బిలియన్ మైక్రో ప్లాస్టిక్ అంటే 11వందల కోట్ల మైక్రో ప్లాస్టిక్, దాంతో పాటు 3బిలియన్ నానో ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తుందని కనుక్కున్నారు.. కంటికి కనిపించవు ఇవి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా పరిశోధకులు వీటిని తాజాగా గుర్తించారు. అందుకే మార్కెట్‌లో మనకు దొరికే కాఫీ, టీ బ్యాగులను వాడకూడదని, పొడిని మాత్రమే వాడాలని వారు అంటున్నారు.
కాఫీ, టీ బ్యాగులను నైలాన్, పీవీసీ, ఎపిక్లోరోపైడ్రిన్, థర్మో ప్లాస్టిక్, పాలిప్రొపెలిన్, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఈ క్రమంలో సదరు బ్యాగులను వేడి వేడి పాలు, లేదా నీటిలో ముంచినప్పుడు వాటి నుంచి ప్రమాదకరమైన రసాయనాలు వెలువడి ఆ ద్రవంలో కలుస్తాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కార్సినోజెన్ల జాబితాకు చెందుతాయని సైంటిస్టులు అంటున్నారు. కార్సినోజెన్లు అంటే క్యాన్సర్ కారకాలే. అవి క్యాన్సర్ వ్యాధులను కలగజేస్తాయి. కనుక కాఫీ లేదా టీ ఏదైనా బ్యాగులను కాక పొడి రూపంలో వాటిని వాడాలని వారు అంటున్నారు. ఈ విషయం తెలిసినప్పుడు మొదట మేము చాలా ఆందోళనకు గురయ్యాం. గత కొన్ని సంవత్సరాలుగా టీ బ్యాగ్ లతోనే గ్రీన్ టీను తాగేవాళ్లు ఎందరో ఉన్నారు. ఇకనైనా వాటిని మానేసి టైం పట్టినా పొడినే ప్రిఫర్ చేయండి.