మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. IDBI బ్యాంక్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. IDBI స్పెషలిస్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీగా వున్నాయి.
ఈ బ్యాంక్ SO, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ని మొదలు పెట్టింది. వారం రోజుల్లోనే ఆ గడువు అయ్యిపోతుంది. కనుక అప్లై చేసుకోవాలని అనుకునే వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీనిలో మొత్తం 114 పోస్టులు వున్నాయి.
ఈ పోస్టుల కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 12, 2023. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. మేనేజర్ పోస్టులు 75 పోస్టులు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు 29 పోస్టులు, డిప్యూటీ జనరల్ మేనేజర్ 10 పోస్టులు వున్నాయి. ప్రిలిమినరీ స్క్రీనింగ్, విద్యా అర్హతలు, పలు పత్రాల ధృవీకరణ ప్రకారం ఎంపిక చేస్తూ వుంటారు. గ్రేడ్ ‘డి’ పోస్టులకి 89 వేలని చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే… EWS, OBC కేటగిరీలకు రూ. 1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. SC/ST కేటగిరీ అభ్యర్థులకు రూ. 200 ఫీజు కట్టాల్సి వుంది. అలానే ప్రక్రియలో అభ్యర్థుల దరఖాస్తు ఫారమ్‌లో, సపోర్ట్‌గా అప్ లోడ్ చేసిన పత్రాల లో వాళ్ళ వయస్సు, విద్యార్హతలు, పని అనుభవం వంటి వాటికి తగ్గట్టుగా ప్రాథమిక స్క్రీనింగ్ కొనసాగుతుంది. అభ్యర్థులు idbibank.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.