నీతి వంతులు అయితే, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు : కిషన్‌ రెడ్డి

-

బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఒకరి పై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. కేటీఆర్‌, కవిత విమర్శలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కల్వకుంట్ల కుటుంబం అంటూ వారిని టార్గెట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. మద్యం వ్యాపారం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించండి అని తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబానికి ఏమైనా చెప్పిందా..? మీరు ఢిల్లీకి వెళ్లండి అక్కడ ఆప్ పార్టీతో కలిసి అక్రమంగా మద్యం వ్యాపారం చేయండని తెలంగాణ ఆడబిడ్డలు మీకు చెప్పారా..? ఈ కల్వకుంట్ల కుటుంబం చేసిన పనితో తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. అన్నా-చెల్లెళ్లు ఇద్దరు కూడా కేవలం అబద్దాలు మాత్రమే మాట్లాడుతున్నారు.

ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న సంపాదన సరిపోదని, బయటి రాష్ట్రాల్లో వ్యాపారాలు చేయమని మీకు తెలంగాణ ప్రజలు చెప్పారా..? వ్యాపారంలో లాభాల్లో తెలంగాణ ప్రజలకు, మహిళలకు వాటాలు ఏమైనా ఇచ్చారా..? మరి కేసు అవ్వగానే తెలంగాణ ప్రజల పేరు చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వ్యాపారంలో తప్పులు చేయన్నట్టైతే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎందుకు లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్స్ ధ్వంసం చేశారు? బీఆర్ఎస్ నేతలు నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారు. అబద్దాలు ఆడటంలో బీఆర్ఎస్ నేతల్ని మించిన వాళ్లు లేరు. ధర్నా చేస్తున్నారంటూ తనకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉందా..? అంటూ కిషన్ రెడ్డి మీడియాలో ప్రశ్నించారు. మొదటి ఐదు సంవత్సరాలు అధికారం వెలగబెట్టిన కేసీఆర్… ఆయన పార్టీ ఒక్క మహిళ లేకుండా పాలన చేసిన వారికి మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి కిషన్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version