దేశంలో చీతాల సంఖ్యను మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే నమీబియా నుంచి 8 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం.. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి మరిన్ని చీతాలను రప్పిస్తోంది. ఫిబ్రవరి 18న 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చేరుకుంటాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.
భారత్‌కు తీసుకురానున్న వాటిలో ఏడు మగ, ఐదు ఆడ చీతాలు ఉండనున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌కు ఈ 12 చిరుతలను అధికారులు తరలించనున్నట్లు వెల్లడించారు.
1948లో దేశంలో చీతాలు అంతరించిపోయాయి. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఎనిమిది చీతాలను కునో పార్క్‌లోకి విడిచిపెట్టారు. వాటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. దీంతో 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చీతాలు దేశంలోకి వచ్చినట్లైంది.