దారుణం.. హోటల్‌ రిసార్ట్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం..

-

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అన్యపుణ్యం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడుతూ.. తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్నిచట్టాలు తీసుకచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. కామాంధులు చిన్నపిల్లలు, పసికందు అనే జాలి దయ లేకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే గోవాలో చోటు చేసుకుంది.

వివరాల్లో వెళితే.. నార్త్ గోవాలోని అరాంబోల్‌లోని హోటల్‌ రిసార్ట్‌లో 12 ఏళ్ల రష్యన్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అకృత్యానికి పాల్పడింది ఆ రిసార్ట్‌లో పనిచేస్తున్న రూమ్‌ బాయ్‌ అని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందుతుడి రవి లమానిని అతని సొంతూరు కర్ణాటకలోని గడగ్‌లో అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ నాయక్‌ మాట్లాడుతూ…బాధితురాలి తల్లి తన కుమార్తెను స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద వదిలి మార్కెట్‌ నుంచి అవసరమైన వస్తువులు తీసుకురావడానికి వెళ్లినపుడు ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ఆ తర్వాత నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version