లాక్ డౌన్ ను అతిక్రమించిన 13 ఏళ్ల బాలుడు… అరెస్ట్!

-

చైనాలో మొదలైన సూక్ష్మజీవి కరోనా వైరస్ నేడు ప్రపంచ దేశాలను వణికించేస్తున్న విషయం తెలిసిందే. ఒకపక్క చైనా లో రోజు రోజుకు పరిస్థితులు చక్కబడుతుండగా మరోపక్క అమెరికా, యూరప్ దేశాల్లో మాత్రం పరిస్థితి రోజు రోజుకు చేయి దాటిపోతుంది. చైనా తరువాత ఇటలీ,అమెరికా లలో అత్యధిక కరోనా మరణాలు చోటుచేసుకోవడం తో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే ఇతర దేశాలకు అలాంటి పరిస్థితులు రాకూడదు అన్న ఉద్దేశ్యం తో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దేశాలు,ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నా కూడా జనాలు మాత్రం ఏమాత్రం లక్ష్య పెట్టకుండా రోడ్ల పైకి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా రోడ్డుపై తిరుగుతున్నాడని 13 ఏళ్ల బాలుడుని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్డుపై తిరుగుతున్నాడు అంటూ పోలీసులు ఇంగ్లాండ్ లోని లీడ్స్ నగరంలో 13 ఏళ్ల బాలుడుని అరెస్ట్ చేశారు. బాలుడిని అడ్రస్ అడిగినా చెప్పేందుకు నిరాకరించాడని.. దీంతో తాను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఇంగ్లాండ్‌లో లాక్ డౌన్‌ను పట్టించుకోకుండా ఫుట్ బాల్ ఆడుతున్న యువకులపై కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్ ప్రభుత్వం గత గురువారం నుంచి పోలీసులకు కొత్త అధికారాలను ఇచ్చింది.

దీని ప్రకారం లాక్‌డౌన్ సమయంలో ప్రతి పోలీసు అధికారి ‘ఫోర్ సెక్షన్ ప్లాన్’ను అనుసరించాల్సి ఉంటుంది. అంటే.. ఎవరైనా రోడ్డు మీద కనపడితే ముందుగా వారు బయటకు రావాల్సిన అవసరం గురించి అధికారి తెలుసుకోవాలి. అవసరం లేకపోయినా వచ్చారని తెలిస్తే వారి వివరాలు తీసుకుని ఇంటికి పంపించేయాలి. ఇక వివరాలు చెప్పకుండా, వెనుదిరగడానికి నిరాకరిస్తే ఫైన్ వేసే అధికారం పోలీసులకు ఉంటుంది. బయటకు వచ్చిన కారణాలు, వారి తీరు బట్టి ఫైన్ 30 యూరోల నుంచి వెయ్యి యూరోల వరకు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version