హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. ఈ ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు

-

ఈ మధ్యకాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాతావరణ కాలుష్యం వంటి కారణలతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోదారులు మొగ్గుచూపుతున్నారు. అయితే బ్యాటరీతో నడిచే ఈ వాహనాలు ఛార్జింగ్ చాలా కీలకం. ఎప్పుడైన ఎక్కడైన చార్జింగ్ అవసరం ఏర్పడ వచ్చు. అయితే ఛార్జింగ్ సమస్యను పరిష్కరించేందుకు, పర్యావరణ హితమైన, ఈవీ లను మరింత ప్రోత్సహించేుందుకు గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు 100 ప్రాంతాల్లో నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది జీహెచ్ ఎంసీ. అయితే ప్రస్తుతం గ్రేటర్ లో 14చోట్ల మాత్రమే ఛార్జీంగ్ స్టేషన్లు ఏర్పాటుకు సంకల్పించింది.

ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెరుగుతోంది. కంపెనీలు కూడా ఈవీ ల్లో కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుండడంతో ఈవీ వాహనాలు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఛార్జింగ్‌ స్టేషన్లు కీలకం అవుతున్నాయి. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి నిర్ణీత కిలోమీటర్లు మాత్రమే వాహనం ప్రయాణిస్తుంది. ఛార్జింగ్‌ అయిపోతే తిరిగి ఇంధనం వినియోగించాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని నగరంలో విరివిగా ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారుల నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలోని 14 చోట్ల ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల (4వీలర్‌)ను ఏర్పాటు చేయబోతున్నది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version