అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఆశచూపి రూ.14 కోట్లు వసూలు చేసి.. కూకట్‌పల్లిలో బోర్డు తిప్పేసింది వెల్ విజన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పెట్టిన పెట్టుబడికి ప్రతినెల ఫ్రిడ్జ్, టీవీలు బోనస్‌గా ఇస్తామంటూ ఆశ చూపించిన కంపెనీ.. లక్షకి టీవీ, 2 లక్షలకు వాషింగ్ మిషన్, 3 లక్షలకు ఫ్రిడ్జ్‌లు ఇస్తామంటూ ప్రకటనలు చేసింది. అయితే వెల్విజన్పై కేసు నమోదు చేసారు సైబరాబాద్ఈఓడబ్ల్యూ అధికారులు.
మూడు స్కీమ్ లతో నట్టేట ముంచిన వెల్విజన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దగ్గర సుమారు 200 మంది మోసపోయారు. మోసపోయామని తెలిసి, ఫిర్యాదు చేసారు సుమారు 35 మంది బాధితులు. దాంతో వెల్విజన్ ఛైర్మన్ కందుల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసారు ఈఓడబ్ల్యూ. గత మూడేళ్లుగా పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేస్తుంది విలివిజన్ కంపెనీ. జనవరిలో సంక్రాంతి హాలిడేస్ అంటూ ఆఫీస్ కి తాళం వేసిన మేనేజ్మెంట్.. అప్పటి నుండి మళ్ళీ ఓపెన్ చేయకపోవడంతో మోసపోయాం అని గుర్తించారు బాధితులు.