ఇక కొన్ని రోజుల్లో ఈ ఏడాది అయ్యిపోతోంది. కొత్త సంవత్సరం వస్తోంది. అయితే మీరు ఏమైనా ఆర్ధిక లావాదేవీలు చేయాలనుకుంటే బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఇక జనవరిలో ఎప్పుడెప్పుడు బ్యాంక్ సెలవులు ఉన్నాయో ఇప్పుడే చూద్దాం.
ఈ సెలవుల గురించి తెలుసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. లేదంటే మీరు పూర్తి చేసుకోవాలని అనుకునే ముఖ్యమైన పనులు పూర్తి కావు. కనుక ముందే సెలవుల గురించి చూసుకోండి. జనవరి నెలలో బ్యాంకులు 15 రోజుల పాటు క్లోజ్. మరి ఏయే రాష్ట్రాలకు ఎప్పుడు సెలవు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి 1– న్యూ ఇయర్, ఆదివారం కనుక అన్ని చోట్ల సెలవే.
జనవరి 2– మిజోరామ్ లో బ్యాంకులు క్లోజ్.
జనవరి 3– ఇంఫాల్ లో బ్యాంకులు క్లోజ్.
జనవరి 5– గురు గోబింద్ సింగ్ జయంతి కారణంగా హర్యానా, రాజస్థాన్ లో సెలవులు.
జనవరి 8– ఆదివారం అన్ని చోట్ల సెలవే.
జనవరి 14– మకర సంక్రాంతి, రెండవ శనివారం.
జనవరి 15– కనుమ, ఆదివారం అన్ని చోట్ల సెలవే.
జనవరి 22– ఆదివారం అన్ని చోట్ల సెలవే.
జనవరి 23– నేతాజీ సుబాష్ చంద్రబోస్ జయంతి కారణంగా త్రిపుర, పశ్చిమ బెంగాల్ లో బ్యాంకులు పని చేయవు.
జనవరి 25– రాష్ట్ర దినోత్సవం కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులు క్లోజ్.
జనవరి 26– గణతంత్ర దినోత్సవం కారణంగా అన్ని రాష్ట్రాలకు సెలవు.
జనవరి 28– నాల్గవ శనివారం అన్ని చోట్ల సెలవే.
జనవరి 29-ఆదివారం అన్ని చోట్ల సెలవే.