కేంద్ర ప్రభుత్వం చాలా పథకాల్ని తీసుకు వచ్చింది. అలానే ఎప్పటికప్పుడు సామాన్యులకి ఆర్ధికంగా ఏదో విధంగా సహాయం చేస్తోంది. ఇదిలా ఉంటే కేంద్రం సామాన్యులకు ఊరట కలిగించేందుకు సిద్ధంగా ఉందా..? లేదా అనేది చూస్తే..
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సామాన్యులకు ఊరట కలిగించేందుకు రెడీ అవుతోందని చెప్పాలి. మరోసారి ఉచిత బియ్యం గడువును పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫ్రీ బియ్యం స్కీమ్ ఈ నెల ఆఖరుతో క్లోజ్ అయ్యిపోనుంది. కానీ మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. చైనా లో కోవిద్ కేసులు ఎక్కువయ్యాయి.
అందుకే మళ్ళీ ఉచిత బియ్యం స్కీమ్ గడువును ఎక్స్టెండ్ చేసేలా వున్నారు. అయితే ఈ విషయాన్ని కేంద్రం ఇంకా చెప్పలేదు. కానీ కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరండ్లాజే ఈ విషయం పైన నరేంద్ర మోదీ ఒక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన పథకాన్ని ఎక్స్టెండ్ చేసినా కూడా సరిపడా స్టాక్ ఉందని వివరించారు. ఒకవేళ కనుక సర్కార్ ఫ్రీ బియ్యం పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తే పేదలకు ఊరట కలుగుతుంది. వచ్చే క్యాబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. సెప్టెంబర్ నెలలో పీఎంజీకేఏవై స్కీమ్ గడువును మూడు నెలలు ఎక్స్టెండ్ చేసారు. దానితో ఈ స్కీమ్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది.