బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మంది అరెస్ట్

-

హఫీజ్‌ పేట భూవ్యవహారానికి సంబంధించి …బోయిన్‌ పల్లిలో జరిగిన కిడ్నాప్‌ పెద్ద దుమారమే లేపుతోంది. పోలీసుల దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త కొత్త నిజాలు తెలుస్తున్నాయి. ఈ కిడ్నాప్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మంది అరెస్టు అయ్యారు. దీంతో కిడ్నాపర్ల జాబితా 19 చేరింది. మరొక తొమ్మిది మంది కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. భార్గవ్ రామ్ , చంద్రహాస్,  జగద్విఖ్యాతి రెడ్డి,  మాదాల శ్రీను,  భార్గవ్ రామ్ తల్లిదండ్రుల కోసం ఇంకా గాలిస్తున్నారు.

ఈ కిడ్నాప్‌కు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఆమె భర్త బార్గవ్‌ రామ్‌ లు కిడ్నాపర్లతో నేరుగా మాట్లాడినట్టు మొదట ఆదారాలు సేకరించిన పోలీసులు అఖిల ప్రియ కస్టడీలో మరిన్ని నిజాలు రాబట్టారు. కస్టడీలో అఖిలప్రియ పోలీసులకు ఏమాత్రం సహకరించపోయినా అఖిలప్రియ నివాసం ఉంటున్న లోధా అపార్ట్‌మెంట్‌తో పాటు క్రిష్ణానగర్‌లోని భార్గవ్‌రామ్‌కు చెందిన స్కూల్‌లోనే స్కెచ్‌ వేసినట్టు ఆదారాలన్నీ సేకరించారు. కిడ్నాప్‌ లో ప్రదాన నిందితుడిగా భావిస్తున్న గుంటూరు శ్రీను పట్టుబడితే…ఈ కిడ్నాప్‌ ఎపిసోడ్‌ మొత్తం బైటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version