రాష్ట్రంలో నిర్వహిస్తున్న గ్రామసభలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో తాజా మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పెండింగ్ బిల్లుల అంశమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఇప్పటికే గ్రామసభల్లో అర్హులకు కాకుండా అనర్హులను ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్తులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులను నిలదీస్తున్నారు.దీంతో ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ తాజాగా బిల్లుల కోసం ఓ సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం జిగిత్యాల జిల్లాలో సెన్సేషనల్ అయ్యింది.
గ్రామ సభలో పెట్రోల్ పోసుకొని సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో తాజా మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు – 83 https://t.co/UnhSB6U4Je pic.twitter.com/U7oLxV7BWH
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2025