గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందుకోసం కసరత్తులు చేస్తున్నారు. పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. తెలంగాణ శాసనమండలిలో రెండు గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ అవుతాయి. ఆ రెండింటినీ తమ ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అవుతోంది టీఆర్ఎస్. రెండు ఎమ్మెల్సీ స్థానాలను గులాబీ ఖాతాలో వేసుకోనే ప్రయత్నంలో భాగంగా సరికొత్త ప్యూహానికి తెర లేపుతున్నారు…
టీఆర్ఎస్ ఇప్పుడు తన ఫోకస్ అంతా గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపైనే పెట్టింది. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్యూహంపై కీలక నేతలతో చర్చించారు.
వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపు కోసం ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అవుతున్నారు. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పార్టీలోని యూత్ కు ఎక్కువ ప్రియార్టీ ఇవ్వాలని నేతలకు సూచించారు కేటీఆర్. గ్రాడ్యుయేట్ లను భారీగా ఓటర్లుగా చేర్పించామని… వారి ఓట్లు అన్నీ టీఆర్ఎస్ అభ్యర్థికే వచ్చేలా చూడాలని చెప్పారు కేటీఆర్. ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలసికట్టుగా పని చేయాలని క్యాడర్ కు సూచించారు ఆయన.
ఇక ఖమ్మం వరంగల్ నల్గొండ స్థానంలో అభ్యర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వడంతో ప్యూహాలకు పదును పెడుతుంది గులాబీ దళం.ఇక ఈస్థానం నుంచి టీజేఎస్ చీఫ్ కోదండరాం,తీన్మార్ మల్లన్న,రాణి రుద్రమ బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎస్టీ సామాజిక వర్గ అభ్యర్ధి బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.కోదండరాంకి కాంగ్రెస్ మద్దతిస్తే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ కి అవకాశం ఉండేది.ఎవరికి వారు ఉమ్మడి అభ్యర్ధిని నిలపడంతో ఫైనల్ గా తమకే లాభం చేకురుతుందని లెక్కలేస్తుంది అధికార టీఆర్ఎస్.
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో నేతలతో చాలా విషయాలపై చర్చించారు కేటీఆర్. ఈ క్రమంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టాపిక్ కూడా వచ్చింది. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉంది.. దాన్ని గురించి తర్వాత మాట్లాడుదామని కేటీఆర్ చెప్పారు. ఇక హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి జిల్లా అభ్యర్ది పై టీఆర్ఎస్ ఇంకా తుది నిర్ణయానికి రానట్లు తెలుస్తుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ వామపక్షాల అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశం ఉంది.ఇక్కడ పరిస్థితిని బట్టి నాగేశ్వర్ కి మద్దతిచ్చే విషయం పై ఆలోచిస్తుంది టీఆర్ఎస్.