కప్పలు, పాముల వల్ల 16 బిలియన్ డాలర్లు నష్షం.. అధ్యయనంలో తేలిన షాకింగ్ విషయం.. 

-

నోరులేని వాటిపై మనకు కొంచెం జాలి ఉంటుంది. పాపం అవి ఏం చేస్తాయ్‌లే అని లైట్‌ తీసుకుంటాం. పాములైతే నోరు లేకున్నా డేంజర్‌.. వీటి విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. కానీ కప్పలకు ఎవరూ భయపడరు. అసలు ఏం చేయలేవు కూడా..అరవడం తప్ప..కానీ ఈ రెండింటి వల్ల ఏకంగా 16 బిలియన్ల డాలర్ల నష్టం వచ్చిందట.. వాయమ్మనే అంత నష్టం వచ్చేలా ఇవి ఏం చేసాయ్‌..? వీటివల్ల 34 ఏళ్లుగా గ్లోబల్ ఎకానమీకి భారీ నష్టం వాటిల్లింది. ఈ షాకింగ్ విషయాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో తేల్చారు.
అమెరికన్ బుల్ ఫ్రాంగ్, బ్రౌన్ ట్రీ స్నేక్ కారణంగా 1986 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు జరిగిన నష్టాన్ని వారు సుమారుగా అంచనా వేశారు. బ్రౌన్ ట్రీ స్నేక్‌లు ఏకంగా 10.3 బిలియన్ డాలర్ల విలువైన నష్టానికి కారణమని వారు అంచనా వేశారు. పాక్షికంగా అనేక పసిఫిక్ దీవుల్లో అవి అదుపు లేకుండా వ్యాపిస్తున్నాయి. అయితే గ్యామ్‌లో గత శతాబ్ధంలో యూఎస్ మెరైన్‌లచే సరీసర్పాలు ప్రవేశించినట్లు చెబుతున్నారు.
బ్రౌన్ ట్రీ స్నేక్‌లు ఈ ప్రాంతంలోని విద్యుత్ పరికరాలపై పాకుతూ, అవి పని చేయకుండా చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్లు ఈ పాములను ఇక్కడ వదిలారని సమాచారం..అయితే రెండు మిలియన్లకు పైగా బ్రౌన్ ట్రీ పాములు చిన్న పసిఫిక్ ద్వీపంలో ఉన్నట్లు అంచనా. అదేవిధంగా అమెరికన్ బుల్‌ఫ్రాగ్‌ల సంతానోత్పత్తి ప్రదేశాల చుట్టూ ఖరీదైన కప్ప-ప్రూఫ్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయవలసి వస్తుందట.
బ్రౌన్ అండ్ గ్రీన్ ఫ్రాంగ్‌లను లితోబేట్స్ కాటేస్ బియానస్‌గా పిలుస్తారు. ఉభయచరాలు తప్పించుకోవడాన్ని కేవలం ఐదు చెరువులకు కంచె వేయడం వల్ల జర్మన్ అధికారులకు €270,000 (£226,300) ఖర్చవుతుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. వీటి కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తోందని, అందుకే వీటి రవాణాను అరికట్టాలని పరిశోధకులు అంటున్నారు.
మొత్తానికి అలా జరిగిందంట.. ఇంత నష్టం వస్తుందని తెలుసుకున్న ప్రభుత్వాలు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version