కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి

-

దక్షిణ ఈక్వెడార్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 16 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న రెస్కూ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్ని ఇళ్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 500 మంది జనాభా, 163 ఇళ్లు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆరుగురిని ప్రాణాలతో రక్షించినట్లు వారు వెల్లడించారు. సుమారు 7 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. కొద్ది రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇదొక భయంకరమైన ప్రమాదమని ఆ దేశ రవాణా శాఖ మంత్రి డారియో హెర్రెరా అన్నారు. ప్రస్తుతం తామంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నామని వెల్లడించారు. ఘటన ప్రాంతంలోని ఇళ్ల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని  పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version