భారత్‌ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే.. కేంద్ర మంత్రి రియాక్షన్ ఇదే..!

-

ప్రస్తుతం టెక్ రంగంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు చాట్‌జీపీటీ.  కృత్రిమమేధతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్ చాట్‌జీపీటీ కోసం భారతీయులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దీనికి ఇండియన్ వెర్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనీ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  దీనిపై ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానం ఏంటో తెలుసా..?

‘కొన్ని వారాలు ఆగండి. దీనికి సంబంధించి భారీ ప్రకటన వెలువడుతుంది’ అని వైష్ణవ్‌ సమాధానమిచ్చారు. ఇండియన్‌ గ్లోబల్ ఫోరమ్‌ వార్షిక సదస్సులో భాగంగా సోమవారం ఈ వ్యాఖ్య చేశారు.  అంతర్జాతీయంగా చాట్‌జీపీటీ మార్కెట్ పరిమాణం 3.99 బిలియన్ల డాలర్లుగా ఉండొచ్చని అంచనా.  దాదాపు అన్ని టెక్‌ దిగ్గజ సంస్థలు తమ వెర్షన్లను పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై ప్రకటన వస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version