కొత్త కరోనా టెన్షన్ : ఏపీలో 16 మంది యూకే రిటర్న్స్ మిస్సింగ్..

-

ఆంధ్ర ప్రదేశ్ కు గత నెల రోజుల కాలంలో 1148 మంది యూకే నుంచి వచ్చారని ఏపి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే వీరిలో 1040 మందిని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందని చెబుతున్నారు. వీరిలో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా, 16మంది ఇచ్చిన అడ్రస్ లు సరిపోలడం లేదని వీరు ఎక్కడ ఉన్నారు అనేది గుర్తించలేకున్నామని ఏపి వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. 982 మందిని గుర్తించి వారిని క్వారంటైన్ కు పంపించామని చెబుతుతోంది ఏపి వైద్య ఆరోగ్య శాఖ.

corona

అయితే ఈ 982 మందిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నలుగురి శాంపిల్స్ ను కూడా సీసీఎండి, ఎన్ఐవి పూణెకు పరీక్ష నిమిత్తం పంపినట్టు చెబుతున్నారు. కొత్త రకం కరోనా వైరస్ వీరిలో ఉందేమో పరీక్షిస్తున్నామని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఇక ఈ ఫలితాలు రావడానికి మరో మూడు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రజలెవరూ ఈ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. నిజానికి తెలంగాణలో యూకే నుండి వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారి శాంపిల్స్ ని కూడా సీసీఎండి, ఎన్ఐవి పూణెకు పరీక్ష నిమిత్తం పంపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version