ఆ అమ్మాయి చదువుతున్నది బీఎస్సీ సెకండ్ ఇయర్. వయస్సు 21 సంవత్సరాలు. బీఎస్సీ రెండో సంవత్సరం చదివే వారి వయస్సు దాదాపుగా 21–22 మధ్య ఉంటుంది. ఇప్పుడు అదేందుకు అనుకుంటున్నారా..? అదే ట్విస్ట్. కేరళ తిరువసంతపురం మేయర్ పదవిని ఆర్య రాజేంద్రన్ అనే 21 ఏళ్ల విద్యార్థిని కొట్టేసింది. దేశంలోనే అతి చిన్న వయస్సురాలు మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ రికార్డు పుట్టలోకి ఎక్కనున్నారు. తిరువనంతపురంలోని అల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవన్‌ముగళ్ వార్డు కౌన్సిలర్‌గా సీపీఎం నుంచి బరిలోకి దిగి కేరళలో అతి చిన్న వయస్కురాలిగా గుర్తింపు పొంది విజయం బావుట ఎగర వేశారు.
వారు ఓడిపోవడంతో..
తిరువనంతపురం ఎన్నికల్లో సీపీఎం ఆధ్వర్యంలో ఎల్డీఎఫ్ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంతో మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది. కాగా మేయర్ అభ్యర్థులుగా బరిలో ఉన్న ఇద్దరూ ఓడిపోవడంతో ఆర్య రాజేంద్రన్ పేరు ఖరారైంది. తన చదువు కొనసాగిస్తూనే, ప్రజా సేవ చేసేందుకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తానని ఆర్య రాజేంద్రన్ పేర్కొన్నారు.
గతంలో తెలుగమ్మాయి..
దేశంలో చిన్న వయస్సు మేయర్‌గా తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య(26) పేరు ఉండేవి. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగిన కావ్య ఘన విజయం సా«ధించి మేయర్‌గా ఎన్నికైంది. ప్రస్తుతం ఆర్య రాజేంద్రన్ కేవలం 21 ఏళ్లకే మేయర్ పీఠం సొంతం చేసుకొని కొత్త రికార్డు సృష్టించింది.