ఏపీలో నేడు కొత్త‌గా 1,891 క‌రోనా కేసులు.. 5 మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం పడుతుంది. రాష్ట్ర క‌రోనా బులిటెన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ బులిటెన్ ప్ర‌కారం.. నిన్న‌టితో పోలిస్తే.. నేడు క‌రోనా కేసుల సంఖ్య పెరిగింది. కాగ‌ నిన్న‌టితో పోలిస్తే ఈ రోజు దాదాపు 300 కేసులు పెరిగాయి. కాగ నేడు రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌లలో 1,891 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తం గా 2306943 కేసులు న‌మోదు అయ్యాయి.

అలాగే రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 5 గురు మ‌ర‌ణించారు. అనంతపురం జిల్లాలో ఇద్ద‌రు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఒక్కొక్క‌రు చొప్పున మృతి చెందారు. అలాగే రాష్ట్రంలో ఈ రోజు 10,241 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం 54,040 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఈ రోజు 26,236 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version