ప్రజా విజయోత్సవాల్లో బాణాసంచాలకు రూ.2.39కోట్ల ఖర్చు..

-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల పేరిట అధికారికంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ప్రభుత్వం వేడుకల నిర్వహణలో బాణాసంచాలను వినియోగించింది. దానికోసం ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల రూ.2.39 కోట్లుగా లెక్కలు తేలాయి.

దీనిని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. ప్రజావిజయోత్సవాల పేరిట ఇంకా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో.. హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవని ఈ దుబారా ఖర్చులు ఎలా చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని కార్నర్ చేశాయి. నిధుల దుర్వినియోగానికి పాల్పడటంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన వైఫల్యాన్ని బయటపెట్టుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news