తెలంగాణకు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు – KTR

-

8 ఏళ్లలో తెలంగాణ రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ప్రకటించారు మంత్రి కె.టి.రామారావు. వ్యాపార అనుకూల విధానాలు మరియు అనుకూల పర్యావరణ వ్యవస్థ కారణంగా తెలంగాణ గత ఎనిమిదేళ్లలో వివిధ రంగాలలో 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం గత 8 సంవత్సరాలలో TS iPass ద్వారా 20,000 కంటే ఎక్కువ అనుమతులు (వ్యాపార ప్రతిపాదనలకు) ఇచ్చింది మరియు రూ. 2.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడినిఆకర్షించారు మరియు 1.6 మిలియన్లు లేదా 16 లక్షల ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలను సృష్టించారని తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ హబ్ అని.. ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 33 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశంలోని🇮🇳 ఫార్మాస్యూటికల్స్‌లో 35-40 శాతం తెలంగాణ లోనే తయారుఅవుతున్నాయని చెప్పారు. గతేడాది ఐటీ రంగంలో 4,50,000 ఉద్యోగాలు ఏర్పడగా, ఒక్క తెలంగాణలోనే 1,50,000 ఉద్యోగాలు వచ్చాయి. ఐటీలో ప్రతి 3 ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే సృష్టించబడుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version