ఇరాక్‌లో రణరంగం.. నిరసనకారులపై కాల్పులు.. 20 మంది మృతి

-

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ రణరంగం అవుతోంది. కాల్పులతో బాగ్దాద్ భూమి కంపిస్తోంది. దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రముఖ షియా మతగురువు ముక్తాదా అల్​-సదర్ ప్రకటించడం వల్ల ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు.

ప్రభుత్వ ప్యాలెస్​పై వందలాది మంది నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. ప్యాలెస్ గోడలను బద్దలు కొట్టి.. భవనంలోకి చొచ్చుకుపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో వంద మంది గాయపడ్డారు.

ప్రభుత్వ ప్యాలెస్ గోడను ధ్వంసం చేసిన నిరసనకారులుతాజా ఘటనతో దేశవ్యాప్తంగా సైన్యం కర్ఫ్యూ విధించింది. కేబినెట్ సమావేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం. గతేడాది అక్టోబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అల్​-సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. షియా వ్యతిరేక వర్గాలతో మంతనాలు జరిపేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో దేశంలో రాజకీయం వేడెక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version