బడ్జెట్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం… కాసేపట్లో లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

-

2022-23 కేంద్ర బడ్జెట్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎంతో మంది ఆసక్తిగా చూస్తున్న బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. మరికాసేట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. డిజిటల్ ఫార్మాట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ ఫార్మాట్ లోనే ఎంపీలకు బడ్జెట్ వివరాలను తెలపనున్నారు. కరోనా నేపథ్యంలోనే దేశం మొత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. దేశంలో వ్యవసాయ రంగం మినహా.. అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపింది.

ఈనేపథ్యంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఏవిధంగా ఉంటుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎలాంటి చేయూతను ఇస్తారో..చూడాలి. దీంతో పాటు రక్షణ, పారిశ్రామిక రంగాల్లో నిధుల పెంపుతో పాటు, రైల్వేలో కొత్త ప్రాజెక్ట్ లకు నిధుల కేటాయింపు ఎలా ఉంటుందో మరికాసేపట్లో తెలియనుంది. తెలుగు రాష్ట్రాల విభజన హామీల గురించి బడ్జెట్ లో నిధులను కేటాయించాలని తెలంగాణ, ఏపీలు కోరుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version