21 మంది ఖైదీలు, పది రోజులు 70 వేల మాస్క్ లు, కేవలం 10 రూపాయలు…!

-

కరోనా కట్టడి కావాలి అంటే మాస్క్ లను ధరించడం అనేది తప్పనిసరి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎవరూ కూడా మాస్క్ లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. రోజు రోజుకి మాస్క్ లకు డిమాండ్ అనేది పెరుగుతుంది. మన దేశంలో మాస్క్ లకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ఈ నేపధ్యంలో మాస్క్ లను భారీగా ఉత్పత్తి చెయ్యాలని పలు కంపెనీలు భావిస్తున్నాయి.

తాజాగా  తమిళనాడులో 10 రోజుల్లో 21 మంది ఖైదీలు ఏకంగా 70 వేల మాస్క్ లు కుట్టారు. తమిళనాడు లోని తిరుచ్చి జైలులో ఖైదీలు తయారుచేసిన మాస్క్‌లను రూ.10కి విక్రయిస్తున్నారు జైలు అధికారులు. మాస్క్‌లకు గిరాకీ పెరిగడంతో ఒక్కో మాస్క్ కి బ్లాక్ మార్కెట్ అనేది పెరిగింది. ఒక్కో మాస్క్‌ రూ.30 నుంచి రూ.50కు విక్రయించే పరిస్థితి వచ్చింది. తిరుచ్చి కేంద్ర కారాగారంలో 1,500 ఖైదీలు ఉన్నారు.

టైలరింగ్‌ తెలిసిన 21 మంది ఖైదీలు 10 రోజులుగా సుమారు 70 వేల మాస్క్‌లను రూపొందించి… ఒక్కో మాస్క్‌ను రూ.10కి విక్రయిస్తుండడంతో ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తున్నారట. స్వచ్ఛంధ సంస్థ లు కూడా హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నాయట. దీనితో ఖైదీలు ఇప్పుడు వాటి ఉత్పత్తిని వేగవంతం చేసారు. భారీగా మాస్క్ లను కుట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version