27 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికం

-

దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నది. అయితే, కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ మేరకు 27 జిల్లాలను గుర్తించి, ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, అడ్మినిస్ట్రేటర్లకు మహమ్మారి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతున్నదని, క్షుణ్ణంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఎనిమిది రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఎనిమిది జిల్లాల్లో 10శాతం కంటే ఎక్కువ ఉండగా, 19 జిల్లాల్లో 5 నుంచి 10శాతం ఉన్నట్లు తెలిపింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలోని 11 జిల్లాలు, ఆ తర్వాత మిజోరాం (10), సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పుదిచ్చేరి, మణిపూర్, పశ్చిమబెంగాల్, నాగాలాండ్‌లోకి ఒక్కో జిల్లాలో అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version