కోహ్లీ భావోద్వేగ ట్వీట్.. నాలుగేళ్లుగా భరిస్తున్నారంటూ పోస్ట్

-

సోష‌ల్ మీడియా లో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి తాజా గా ట్వీట్ట‌ర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. కోహ్లీ, అనుష్క వివాహ జీవితం నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోవ‌డం తో కోహ్లి భావోద్వేగ పోస్ట్ చేశాడు. నాలుగు సంవత్సరాలుగా త‌న నా వెర్రి జోకులను నా సోమరితనాన్ని భ‌రిస్తున్న అనుష్క శ‌ర్మ కు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

ఈ నాలుగు సంవ‌త్సారాలు గా తాను చికాకు గా ఉన్నా.. అనుష్క త‌న‌ను ప్రేమిస్తూ ఉంటుంద‌ని అన్నారు. త‌మ నాలుగు ఏళ్ల నుంచి తమ‌ ప్రేమ‌ కు దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడ‌ని అన్నాడు. అలాగే అనుష్క అత్యంత ధైర్య వంతురాల‌ని.. నిజాయితి గ‌ల వ్య‌క్తి అని అన్నారు. అలాగే త‌న‌ను ప్ర‌పంచం మొత్తం వ్య‌తిరేకిస్తున్నా.. అనుష్క త‌న వెనుక నిల‌బ‌డింద‌ని అన్నారు. త‌న‌ను అన్ని విధాలు గా అనుష్క ప్రేమిస్తుంద‌ని అన్నారు. అలాగే తాను అనుష్క ను ఎల్ల‌ప్పుడు ప్రేమిస్తాన‌ని భావోద్వేగం తో అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version