కరోనా రెండో వేవ్‌లో భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మొదటి వేవ్‌లోనూ ఎక్కువగానే కేసులు, మరణాలు సంభవించాయి. నిజానికి మొదటి వేవ్‌లో ప్రపంచ దేశాలు చెప్పిన లెక్కల కన్నా ఎక్కువ సంఖ్యలోనే కోవిడ్ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.
కరోనా మొదటి సందర్భంగా 2020వ సంవత్సరంలో ప్రపంచ దేశాలు చెప్పిన లెక్కల కన్నా 30 లక్షల కరోనా మరణాలు ఎక్కువగా సంభవించి ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో 2020 మరణాల సంఖ్య 3.4 మిలియన్ల మేర ఉంటుందని గణాంకాలు చెబుతుండగా, వాస్తవానికి 6-8 మిలియన్ల మంది చనిపోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
WHO డేటా అండ్ ఎనలిటిక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సమీరా అస్మా మాట్లాడుతూ.. అసలు చెప్పిన లెక్కల కన్నా కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగానే ఉంటుంది. 6 నుంచి 8 మిలియన్ల మరణాలు సంభవించాయి.. అని తెలిపారు. అనేక దేశాలు కేవలం పాక్షిక వివరాలను మాత్రమే వెల్లడించాయి, మరణాల సంఖ్యను కచ్చితంగా కొలవలేదు.. అని అన్నారు.