తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త..రైల్వే బడ్జెట్ లో 30 కేటాయింపులు పెంపు

-

రైల్వే బడ్జెట్ హైలైట్స్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే ఇంచార్జ్ జీ.ఎం సంజీవ్ కిషోర్ మాట్లాడుతూ.. 2022-23 బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వే కి 9125 కేటాయింపులు జరిగాయని..అంటే గతం కంటే 30 శాతం కేటాయింపులు పెరిగాయన్నారు. 2021-22 లో.7049 కోట్ల కేటాయింపు జరిగాయని.. డబ్లింగ్, థర్డ్ లైన్,బై పాస్ ల కోసం 5517కోట్లు గత ఏడాది 4238 కోట్లు కేటాయించిందని చెప్పారు.

కొత్త లైన్ల కోసం 2817 కోట్లు, గత ఏడాది 2195 కోట్లు, కేటాయించారని.. విద్యుద్దీ కరణ కోసం 791 కోట్లు, గత ఏడాది 617 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. లెవల్ క్రోసింగ్, కొత్త బ్రిడ్జిల కోసం 758 కోట్లు, గత ఏడాది 672 కోట్లు కేటాయించారని..ట్రాకులు మరమ్మత్తుల కోసం 1040 కోట్లు, గత ఏడాది 862 కోట్లు కేటాయించారన్నారు. ఇక ఈ ఏడాది నడి కుడి- శ్రీ కాళహస్తి కొత్త రైల్వే లైన్ కోసం 1501 కోట్లు కేటాయించారని.. కోటిపల్లి నర్సపూర్ కొత్త రైల్వే లైన్ కోసం 358 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మునిరాబాద్- మహబూబ్ నగర్ కొత్త లైన్ కోసం 289 కోట్లు, కడప బెంగుళూరు కొత్త లైన్ కోసం 289 కోట్లు, భద్రాచలం సత్తుపల్లి కొత్త లైన్ కోసం 163 కోట్లు, మనోహరబాద్ కొత్తపల్లి కొత్త లైన్ కోసం 160 కోట్లు, అక్కన్నపేట మెదక్ కొత్త లైన్ కోసం 41 కోట్లు, విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం- భీమవరం, నర్సపూర్- నిడదవోలు డబ్లింగ్,విద్యుద్ధికరణ కోసం 1681 కోట్లు,విజయవాడ గూడూరు 3వ లైన్ కోసం 1000 కోట్లు కేటాయించిందన్నారు. గుంటూరు గుంతకల్ డబ్లింగ్ పనుల కోసం 803 కోట్లు, కాజిపేట విజయవాడ థర్డ్ లైన్ కోసం 592.5 కోట్లు, కాజిపేట బల్హార్ష మూడో లైన్ కోసం 550.43 కోట్లు, సికింద్రాబాద్- మహబూబ్ నగర్ డబ్లింగ్, విద్యుద్ధీకరణ కోసం 150 కోట్లు.. గూటి ధర్మవరం డబ్లింగ్ కోసం 100 కోట్లు..అకొల డోన్ డబ్లింగ్ కోసం 5కోట్లు, బై పాస్ లైన్ల కోసం 407 కోట్లు, మన్మడ్ ముదకేడ్ డోన్ విద్యుద్దీకరణ కోసం 229 కోట్లు, ధర్మవరం పాకాల విద్యుద్దీకరణ కోసం 131 కోట్లు, పింపల్ కుతి ముద్ కేడ్ విద్యుద్దీకరణకోసం 129 కోట్లు, పార్లి వైజనాథ్ వికారాబాద్ విద్యుద్దీకరణ కోసం 109 కోట్లు, పూర్ణ అకొల విద్యుద్దీకరణ కోసం 103 కోట్లు, నంద్యాల ఎర్రగుంట్ల విద్యుద్దీకరణ కోసం 51 కోట్లు, లింగంపేట జగిత్యాల – నిజామాబాద్ విద్యుద్దీకరణ కోసం 39 కోట్లు, రైల్వే స్టేషన్లు అభివృద్ధి కోసం 325 కోట్లు, POH KAZI PETA వర్కుషాప్ కోసం 45 కోట్లు, చర్లపల్లి సాటిలైట్ టర్మీనల్ కోసం 70 కోట్లు, మెడిలైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీ కర్నూల్ కోసం 58 కోట్లు, తిరుపతి రైల్వేస్టేషన్లో సౌత్ సైడ్ ఎంట్రీ కోసం 3కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

తెలంగాణ కు 2022-23 ఏడాది కోసం 3048 కోట్లు కేటాయించారని.. గత ఏడాది బడ్జెట్ 2420 కోట్లు కేటాయించారన్నారు. అంటే ఈసారి 26 శాతం బడ్జెట్ పెరిగిందన్నారు. ఏపీకి 2022 – 23 ఏడాది బడ్జెట్ 7032 కోట్లు కేటాయించారని.. గత ఏడాది బడ్జెట్ లో 5812 కోట్లు కేటాయించారని.. వెల్లడించారు. అంటే ఈ సారి బడ్జెట్..21 శాతం పెరిగిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version