మోడీ గ్యారెంటీ కింద 3000 జమవుతాయని జరిగిన నకిలీ ప్రచారంతో పోస్ట్ ఆఫీస్ల ముందు మహిళలు బారులు తీరారు. కర్ణాటకలో హుబ్లీ జిల్లాలో పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాలు తెరిచిన బిపిఎల్ కార్డు ఉన్న మహిళలందరికీ మోడీ గ్యారెంటీ కింద మూడు వేల రూపాయలు ఖాతాలో జమవుతాయని ఫేక్ న్యూస్ ప్రచారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఖాతాలు తెరిచేందుకు స్థానిక మహిళలు పోస్ట్ ఆఫీస్ ల వద్ద భారీ సంఖ్యలో క్యూ కట్టారు.
ఈ విషయంపై పోస్ట్ ఆఫీస్ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది అవి తప్పుడు వార్తలని అలాంటి స్కీం ఎక్కడా లేదని పోస్ట్ మాస్టర్ చెప్పిన వినకుండా పోస్ట్ ఆఫీస్ దగ్గర బారులు తీరారు. మోడీ గ్యారెంటీ కింద 3000 జమవుతాయని తప్పుడు ప్రచారం జరుగుతుందని వాటిని నమ్మి మోసపోవద్దని పోస్టర్లు అంటించిన రాత్రి 8 వరకు పోస్ట్ ఆఫీస్ ల చుట్టూ అంతా తిరిగారు.