ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, ఉత్తర రైల్వే సంస్థల్లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా 3093 పోస్టుల భర్తీ చేయనున్నారు.
అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం అప్రెంటీస్ ఎంపిక ప్రక్రయతోపాటు అభ్యర్థి అర్హతలు నిర్దారిస్తారు. పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలానే తప్పని సరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లలో ITI కోర్సు లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఐటీఐకి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కచ్చితంగా కలిగి ఉండాలి. సెప్టెంబర్ 20, 2021 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి వయసు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు మధ్య ఉండాలి. ఇంకా మిగిలిన వివరాలని ఏమి తెలియజేయ లేదు. సెప్టెంబర్ 20, 2021 న నోటిఫికేషన్ విడుదల అయ్యాక పూర్తి వివరాలు విడుదల చేస్తారు. ఎంపికైన అభ్యర్థులుకి పోస్టింగ్ ఇస్తారు. పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ rrcnr.org లో చూడవచ్చు.