డ్రగ్స్ కేసు : ఈడీ విచారణ కు హాజరైన హీరో తనీష్

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు లో పలువురు సినీ తారలు ఈడీ విచారణకు హాజరు కాగా…. తాజాగా మరో సినీ నటుడు తనిష్… ఈడీ విచారణకు హాజరయ్యాడు. కాసేపటి క్రితమే తన ఇంటి నుంచి నేరుగా ఈడి కార్యాలయానికి చేరుకున్నాడు నటుడు తనీష్.

బ్యాంకు స్టేట్మెంట్ మరియు డాక్యుమెంట్లతో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు తనిష్. ఇక 2017 సంవత్సరంలో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా… నేడు నటుడు తనీష్ ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు.

అలాగే డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు అయిన కెల్విన్ మరియు నటుడు తనిష్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై… విచారించి.. ఆ స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు ఈడీ అధికారులు. డ్రగ్స్ హబ్ గా మారిన.. ఎఫ్ లాంజ్ పబ్బు వివరాలు ఏమైనా తెలుసా అన్న కోణంలో తనుష్ నీ విచారణ చేయనున్నారు పిడి అధికారులు. ఇక ఈ విచారణ ఇవాళ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version