గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 317జీవో అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ సోమవారం‘ఎక్స్’ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.గత ప్రభుత్వం తెచ్చిన 317జీవోను బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.
317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌజ్ కేసులు,హెల్త్,మ్యూచువల్‌కి సంబంధించిన వారిని ట్రాన్స్ఫర్ చేశామన్నారు. స్థానికత అంశం కేంద్రం పరిధిలో ఉందని, దానికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్రానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించి నివేదిక ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు.ఉద్యోగులు,నిరుద్యోగులు ఇది కాంగ్రెస్ బాధ్యత అని మంత్రి వెల్లడించారు.