వారాంతాల్లో ఎంఎంటీఎస్ సేవల్లో కోత విధించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నేపథ్యంలో నేడు, రేపు 34 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది . మొత్తం 16 సర్వీసులు నడుస్తుండగా… అందులో 34 సర్వీసులు అంటే సగం వరకూ సర్వీసులను రద్దు చేసినట్టయ్యింది. ఆయా రైళ్ల రద్దు వివరాలను నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచుతున్నారు.
- లింగంపల్లి – హైదరాబాద్ మధ్య 18 సర్వీసులు రద్దయ్యాయి.
- ఫలక్ నుమా – లింగంపల్లి మధ్య 11 సర్వీసుల రాకపోకలు ఆగనున్నాయి.
- సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య రెండు రద్దయ్యాయి.
- శుక్రవారం కూడా 6 ఎంఎంటీఎస్ సర్వీసులను పాక్షికంగా రద్దు చేసింది. లింగంపల్లి వరకూ వెళ్లకుండా
- లింగంపల్లి – ఫలక్నుమా. హైదరాబాద్ – లింగంపల్లి మధ్య నడిచే రైళ్లను హఫీజ్ పేట్ వరకే పరిమితం చేసింది.