ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం యావత్ క్రికెట్ ప్రపంచానికి షాక్ కలిగించింది. ఆయన మరణాన్ని క్రికెట్ లోకం జీర్ణించుకోలేకపోతోంది. తాను క్రికెట్ కు అందించిన సేవలను కొనియాడుతోంది క్రికెట్ ప్రపంచం. గత శుక్రవారం థాయ్ లాండ్ లో గుండె పోటుతో షేన్ వార్న్ మరణించారు. షేన్ వార్న్ మృతి చెందడంపై టీమిండియా నివాళులు అర్పించింది. ఇది ఇలా ఉండగా.. షేన్ వార్న్ మరణంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
వార్న్ చనిపోవడానికి నాలుగు గంటలకు ముందు మసాజ్ చేసే నలుగురు అమ్మాయిలు ఆయన విల్లాలోకి వెళ్లారు. యువతులు లోపలికి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వార్న్ బతి కుండగానే ఆయనను చివరి సారిగా చూసింది ఆ నలుగురు అమ్మాయిలేనని పోలీసులు సైతం నిర్ధారించారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం వార్న్ చనిపోయిన రోజున మధ్యాహ్నం 1.53 గంటలకు మసాజ్ చేసే నలుగురు అమ్మాయిలనున పిలిపించుకున్నారు.
వీరిలో ఇద్దరు వార్న్ ఉన్న గదిలోకి వెళ్లగా.. మిగిలిన ఇద్దరూ వార్న్ స్నేహితుల గదుల్లోకి వెళ్లారు. వార్న్ తో ఇద్దరు అమ్మాయిలు దాదాపు గంటకు పైగా గడిపి 2.58 గంటల సమయంలో బయటకు వెళ్లి పోయారు. అయితే.. అదే రోజు సాయంత్రం వార్న్ మరణించారు.దీంతో అమ్మాయిలను పోలీసులు విచారణ చేస్తున్నారు.