ఉచితాలు వద్దు
ఉద్యోగాలు ముద్దు
ఈ నినాదాన్ని ఆంధ్రాలో వినిపించండి
అప్పుడు మంచి ఫలితాలు వస్తాయో లేదో చూద్దురు కానీ…?
ప్రశాంత్ కిశోర్ అనే వ్యక్తి మారిపోయాడా లేదా పరిణామాలే ఆయనను మార్చేశాయా..? ఎందుకంటే ఎప్పుడూ ఉచిత పథకాలు, సానుభూతి రాజకీయాలు నడిపే ప్రశాంత్ కిశోర్ తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. కొత్త దారిలో వెళ్తూ మంచి పేరు తెచ్చుకునేందుకు ఆ విధంగా జాతీయ స్థాయిలో వ్యూహకర్తగా మరోసారి తనని తాను నిరూపించుకునేందుకు కూడా తాపత్రయపడుతున్నారు.ఈ క్రమంలోనే నిన్నటి వేళ కేసీఆర్ తో మంచి ప్రకటన ఒకటి ఇప్పించి అందరి మెప్పూ అందుకున్నారు.
ముఖ్యంగాతెలంగాణ అనే కాదు ఆంధ్రా యువత కూడా కేసీఆర్ ప్రకటనను ఎంతో మెచ్చుకుంటున్నారు.
ఆంధ్రాకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఆ రోజు నవరత్నాల పేరిట జగన్ ను పక్కదోవ పట్టించారని,ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించేందుకు కారణం అయ్యే పథకాలు ఎందుకని ఈ విధంగా ప్రకటించేందుకు జగన్ ను సిద్ధం చేశారని పలువురు ఇవాళ్టికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆంధ్రాలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుకు కూడా కారణం ఒక్కడే అతడే ప్రశాంత్ కిశోర్ అన్నంత కోపం కూడా అందరిలోనూ ఉంది.
కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తో ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రా యువత. ఓ ముఖ్యమంత్రి ఉచితాలు అంటూ అప్పులు చేసి పథకాలు అమలు చేస్తుంటే, మరో ముఖ్య మంత్రి తనదైన పంథాలో దూసుకుపోవడమే ఇవాళ్టి విచిత్రం.ఎనీవే సెబ్బాస్ రా కేసీఆర్ !